![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -141 లో.. రామలక్ష్మిని మల్లేశ్ లోపలికి పిలిచి.. తాడుతో బంధిస్తాడు. ఏంటి అన్న ఇది అని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసని రామలక్ష్మిపై మల్లేశ్ విరుచుకుపడతాడు. నన్ను పోలీసులకి పట్టించడానికి ఇక్కడికి వచ్చావని తెలుసు అని మల్లేశ్ అంటాడు. మరొకవైపు పనిమనిషి ద్వారా రామలక్ష్మి హడావిడిగా ఎక్కడికో వెళ్ళిందని శ్రీవల్లి తెలుసుకొని.. తన భర్త సందీప్ కి, అత్త శ్రీలతకి చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరు టెన్షన్ పడుతారు.
మరొకవైపు పెద్దాయనకి రామలక్ష్మి వెళ్తున్న ఆటో కన్పించకపోయేసరికి సీతాకాంత్ కి ఫోన్ చేసి రామలక్ష్మి డైవర్ట్ అయిపోయిందని చెప్పగానే.. ఏదైనా ప్రాబ్లలో ఉండవచ్చని సీతాకాంత్ వెళ్తాడు. అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావంటూ శ్రీలత అడుగుతుంది. రామలక్ష్మి తనపై పడ్డ నిందని పోగొట్టుకోవడానికి వెళ్ళింది.. తాతయ్య వెనకాలే వెళ్ళడు.. తనకి కన్పించడం లేదంట అని సీతాకాంత్ అనగానే.. అది కన్పించకపోవడం కాదు బావగారు పారిపోయింది.. నిన్న నగలు దొంగతనం చేసింది.. ఇప్పుడు వెళ్ళిపోయింది.. ఇదంతా తన ప్లాన్ ప్రకారం చేసిందని శ్రీవల్లి అనగానే.. నోర్ముయ్ అంటూ తనపై సీతాకాంత్ విరుచుకుపడుతాడు. తను ఏ తప్పు చెయ్యదని సీతాకాంత్ అనగానే.. అది నువ్వు ఎలా చెప్పగలవని శ్రీలత అంటుంది. నా మనసు చెప్తుందని సీతాకాంత్ అంటాడు. ఈ నగలు తీసుకొని ఆ అభి గాడితో వెళ్ళిపోయి ఉంటుందని శ్రీవల్లి అనగానే తనపై ధన, సీతాకాంత్ లు కోప్పడతారు.
ఆ తర్వాత రామలక్ష్మికి దొంగతనం చేసి గుణం లేదని సీతాకాంత్ అనగానే.. అవునంటూ పెద్దాయన వస్తాడు. తనతో పాటు మల్లేశ్, రామలక్ష్మిని తీసుకొని వస్తాడు పెద్దాయన. ఆ తర్వాత రామలక్ష్మిని పెద్దాయన సేవ్ చేసి మల్లేశ్ ని తీసుకొని వచ్చింది గుర్తుకు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇతను ఎవరు మల్లేశ్ ని ఉద్దేశించి సీతాకాంత్ అడుగగా.. మల్లేశ్ జరిగింది మొత్తం చెప్తాడు. సందీప్ నా దగ్గర అప్పు తీసుకొని వాటికి బదులు ఈ నగలు ఇచ్చాడని మల్లేశ్ చెప్పగానే సందీప్ భయపడతాడు. అతను చెప్పేది నిజమేనా అని సీతాకాంత్ అడుగగా.. సందీప్ నిజమే అంటాడు. నువ్వు దొంగతనం చేసి రామలక్ష్మిపై నింద వేస్తావా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |